ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. ఆరు మ్యాచులు ముగిసే సరికి ఒక్క ముంబై మీద ఆఖరి ఓవర్లో ఓటమిని మినహాయిస్తే మిగిలిన 5 మ్యాచులు గెలుచుకుని పాయింట్స్ టేబుల్ లో పదిపాయింట్లు సాధించిన తొలి టీమ్ గా ఈ సీజన్ లో రఫ్పాడిస్తోంది ఢిల్లీ. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో మ్యాచ్ విన్నర్ ఢిల్లీని విజయ తీరాలకు చేరుస్తున్నారు. ఓ మ్యాచ్ లో అశుతోష్ శర్మ ఆడితే మరో మ్యాచ్ లో కేఎల్ రాహుల్..నిన్న రాజస్థాన్ మీద మ్యాచ్ లో మిచెల్ స్టార్క్. కానీ అన్ని మ్యాచుల్లోనూ నిలకడగా ఆడుతున్న ఇద్దరు ఢిల్లీ విజయాల్లో చాలా అంటే చాలా కీలపాత్ర పోషిస్తున్నారు. వాళ్లే ఐరన్ మ్యాన్ కుల్దీప్ యాదవ్..సూపర్ మ్యాన్ అండ్ కెప్టెన్ అక్షర్ పటేల్. ముందుగా కుల్దీప్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ఐపీఎల్ లో కుల్దీప్ అంత తక్కువ ఎకానమీతో 11 వికెట్లు తీసిన బౌలర్ మరొకడు లేడు. ప్రతీ మ్యాచ్ లోనూ రాణిస్తూ మిడిల్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేస్తూ బోనస్ గా వికెట్లు కూడా తీస్తున్నాడు దుమ్ము రేపుతున్నాడు కుల్దీప్ యాదవ్. నిన్న రాజస్థాన్ తో మ్యాచ్ లోనూ అంతే. 4 ఓవర్లు వేసి 33 పరుగులే కీలకమైన యశస్వి జైశ్వాల్ వికెట్ తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్. అప్పటికే హాఫ్ సెంచరీ కొట్టిన ఊపు మీదున్న యశస్వి జైశ్వాల్ ఢిల్లీకి మరింత నష్ట చేయకముందే అవుట్ చేసి ఇదిగో ఇలా ఐరన్ మ్యాన్ లా ఫోజు ఇచ్చాడు. ఈ సీజన్ అంతా అంతే పరుగులను కంట్రోల్ చేస్తూ మరో సైడ్ వికెట్లు తీస్తూ ఢిల్లీ పాలిట రియల్ ఐరన్ మ్యాన్ లా నిలబడుతున్నాడు. మరో వైపు అక్షఱ్ పటేల్. వాస్తవానికి అక్షర్ పటేల్ బౌలింగ్ ఆల్ రౌండర్. అంటే బౌలింగ్ ఎక్కువ అప్పుడప్పుడు బ్యాటింగ్ లో తోడ్పాటు అంతే. కానీ అక్షర్ పటేల్ అలా కాదు సూపర్ మ్యాన్ లా సూపర్ పవర్స్ ఉన్నట్లు టూ డౌన్, త్రీడౌన్ లో కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ కు దిగేస్తున్నాడు. నిన్న రాజస్థాన్ మ్యాచ్ లో అంతే. పోరల్ ఆడినా చాలా లో స్కోరే చేసిన ఢిల్లీని 188 పరుగులు అఛీవ్ అయ్యేలా ఇన్నింగ్సో ఊపు తెచ్చాడు అక్షర్ పటేల్. 14 బంతులు మాత్రమే ఆడి 4 ఫోర్లు 2 సిక్సర్లతో చకా చకా 34 పరుగులు చేసి అవుటైపోయాడు. ఈ సీజన్ లో టీమ్ ఇబ్బందిలో పడినప్పుడల్లా బ్యాటింగ్ కు దిగుతూ వికెట్ల పతనాన్ని ఆపుతూ సేమ్ టైం బౌండరీలతో విరుచుకుపడుతూ నిజంగా సూపర్ మ్యాన్ లా టీమ్ ను కాపాడుకుంటున్నాడు కెప్టెన్ అక్షర్ పటేల్. అందుకే ఈ ఇద్దరు ఢిల్లీ స్పిన్నర్లలో కుల్దీప్ ఐరన్ మ్యాన్. అక్షర్ పటేల్ సూపర్ మ్యాన్.